ఆ విషయంపై చంద్రబాబుతోనూ చర్చిస్తాను: ముఖ్యమంత్రి కెసిఆర్
- April 29, 2018
దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో భేటీ తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. సమాఖ్య వ్యవస్థతోనే భారత్‌కు మనుగడ అన్నారు కేసీఆర్. థర్డ్ ఫ్రంట్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలన్నారు. చాలా అంశాలపై స్టాలిన్‌తో చర్చించామన్నారు. ఈ భేటీలను రాజకీయ కోణంలో కాకుండా.. దేశాభివృద్ధికి సరికొత్త దిక్సూచిగా చూడాలన్నారు కేసీఆర్. జాతీయ పార్టీలు మౌలిక వసతులు కల్పించలేకపోయాయని, రాష్ట్రాలకు మరింతగా అధికారాలు, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. మే 10న తెలంగాణకు రావాలని స్టాలిన్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు.
ఫ్రంట్ విషయమై మరో రెండు మూడు నెలల తర్వాత ఓ క్లారిటీ వస్తుందని కేసీఆర్ అన్నారు. ఫ్రంట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!