జర్నలిస్టులే లక్ష్యంగా ఆత్మాహుతిదాడులు

- April 30, 2018 , by Maagulf
జర్నలిస్టులే లక్ష్యంగా ఆత్మాహుతిదాడులు

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ రక్తసిక్తమైంది. ఐఎస్‌ ఉగ్రవాదులు మరో మారు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనలో 25 మంది మృతిచెందారు. ఐతే వివరాల్లోకి వెల్తే మొదటి బాంబు పేలడంతో ఆ సఘటనను కవర్‌ చేయడానికి ఎక్కువ సంఖ్యలో మీడియా ప్రతినిధులు ,రిపోర్టర్లు వెళ్లారు. వాళ్లు అక్కడికి చేరుకోగానే ఆత్మాహుతి దాడికి సిద్ధమైన రెండో వ్యక్తి పేలుడు పదార్ధాలతో పేల్చుకున్నాడు. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పోలీస్‌ అధికారి వెల్లడించారు. మృతిచెందిన 8 మంది జర్నలిస్టులు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారని, మరో ఆరుగురు పాత్రికేయులు తీవ్రంగా గాయపడ్డారని జర్నలిస్టు సేఫ్టీ కమిటీ పేర్కొంది. ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని తీవ్రంగా ఖండించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com