ఫేస్‌బుక్‌ ద్వారా డెంటల్‌ ఆపరేషన్‌: ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌

ఫేస్‌బుక్‌ ద్వారా డెంటల్‌ ఆపరేషన్‌: ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌

ఇద్దరు వ్యక్తులు ఓ అపార్ట్‌మెంట్‌లో డెంటల్‌ క్లినిక్‌ని అక్రమంగా నిర్వహిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సోషల్‌ మీడియా (ఫేస్‌బుక్‌) ద్వారా ప్రకటనలు ఇస్తూ, రోగుల్ని ఆకర్షించి, వారికి లైసెన్స్‌ లేని క్లినిక్‌లో దంత వైద్యం నిర్వహిస్తున్నారు నిందితులు. పోలీసులు ఈ నిందితుల్ని అరెస్ట్‌ చేయడం కోసం అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఫేస్‌ బుక్‌ ద్వారా నిందితుల్ని కాంటాక్ట్‌ చేసి, వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి మెడికేషన్‌ని, ఇతర పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్టు చేసినవారిలో ఒకరు అరబ్‌ అనీ, ఇంకొకరు యూరోపియన్‌ అనీ భావిస్తున్నారు. నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. 

Back to Top