జ్యోతికతో నటించే ఛాన్స్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి
- May 01, 2018
తమిళ చిత్రం 'నాచ్చియార్' తరువాత జ్యోతిక నటించబోతున్న చిత్రం 'కాట్రిన్ మొళి'. సామాజిక స్పృహతో సినిమాలు తీస్తారన్న పేరు సంపాదించిన సీనియర్ దర్శకుడు రాధామోహన్ తెరకెక్కించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. హిందీలో విద్యాబాలన్ ప్రధానపాత్రలో ఘన విజయం సాధించిన 'తుమ్హారీసులు' చిత్రానికి రీమేక్ ఇది. కథ ప్రకారం జ్యోతికకు కవలలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. ఆ పాత్రల్లో నిజమైన కవలలనే నటింపజేయాలని రాధామోహన్ నిర్ణయించారు. హిందీలోనూ ప్రత్యేకంగా అన్వేషించి కవల సోదరీ మణులను పట్టుకున్నారు. ఇప్పుడు తమిళ వెర్షన్ కోసం 35 నుండి 45 ఏళ్లలోపు ఉన్న కవల సోదరీమణులను వెతుకుతున్నారు. సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కలిగిన కవలు 98408 41150 వాట్సాప్ నెంబరు ద్వారా తమను సంప్రదించవచ్చని 'కాట్రిన్ మొళి' చిత్ర బృందం ప్రకటించింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్‌లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం