హైదరాబాద్:ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఫొటో కాంటెస్ట్
- May 03, 2018
హైదరాబాద్:సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఫొటో కాంటెస్ట్ నిర్వహించనున్నామని క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజమౌళి చారి, విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జూన్ మొదటి వారంలో ప్రెస్‌క్లబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పోటీలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన ఫొటో జర్నలిస్టులు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఉత్తమ న్యూస్ ఫొటోగ్రాఫ్స్ (8 10 లేక 10 12) సైజులో కనీసం మూడు ఫొటోలను పంపాలని, ఈ నెల 15 వరకు తమ ఎంట్రీలను అందజేయాలని కోరారు. ఫలితాలు జూన్ 1న వెల్లడిస్తామని, మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా అందజేయనున్నామని తెలిపారు. ఎంట్రీలను hpcphotocontest @gmail. comకు పంపించాలని, ఇతర వివరాల కోసం 8096677372, 99483 34445 లో సంప్రదించాలని వారు కోరారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







