30 ఏళ్లుగా 'ఐసే' అతడి ఆహారం

- May 05, 2018 , by Maagulf
30 ఏళ్లుగా 'ఐసే' అతడి ఆహారం

ఫ్రిజ్‌లో వాటర్ తాగితే పళ్లు జివ్వు మంటాయి. మండే ఎండల్లో అయితే కాస్త పర్లేదు కానీ వణికించే చలిలో కూడా ఐస్ వాటర్ తాగాలంటే చాలా కష్టం. మరి అలాంటిది గుజరాత్‌ అమ్రెలీనివాసి కాంతీలాల్‌కు గత 30 ఏళ్లనుంచి ఐసు ముక్కలు తినే అలవాటు ఉంది. రోజుకు 10 నుంచి 15 ఐస్ గడ్డలను అలవోకగా లాగించేస్తాడు. కార్పెంటర్‌గా పని చేస్తున్న ఇతడికి ఐస్ తినడం అంటే మహా ఇష్టం. అందుకే ఇంట్లో రెండు ప్రిజ్‌లు పెట్టుకున్నాడు. అందులో నుంచి వచ్చే ఐస్‌ని ఆబగా ఆరగించేస్తుంటాడు. ఇదేం రోగమో అంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. రక్తంలో సంభవించే మార్పుల కారణంగానే ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలియజేశారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని వైద్యులు నిర్ధారించారు. కాంతీ భాయ్ తన మకాంని కాశ్మీర్‌కి మార్చాలనుకుంటున్నాడట. అక్కడైతే మంచుకి కొరత ఉండదని ఏకంగా కొండలే ఉంటాయి ఎంత తిన్నా అడిగే వారు ఉండరనుకుంటున్నాడేమో. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com