అబుదాబి:ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ట్రాఫిక్‌ జరీమానాల చెల్లింపు

- May 05, 2018 , by Maagulf
అబుదాబి:ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ట్రాఫిక్‌ జరీమానాల చెల్లింపు

అబుదాబి:జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అబుదాబీ పోలీస్‌, ఫస్ట్‌ అబుదాబీ బ్యాంకుతో ఎంఓయూ కుదుర్చుకుంది. ట్రాఫిక్‌ జరీమానాల్ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లించేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అబుదాబీ పోలీస్‌ వెల్లడించింది. అబుదాబీ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ మేజర్‌ జనరల్‌ సయీద్‌ సైఫ్‌ అల్‌ నౌమి, ఫస్ట్‌ అబుదాబీ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ షుబిత్‌ సిటి ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. వాహనదారులు తమ జరీమానాల చెల్లింపు సులభతరమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు అల్‌ నౌమి. ఎఫ్‌ఎబి బ్యాంకు వినియోగదారులు తమ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల్ని వినియోగించి ట్రాఫిక్‌ జరీమానాల్ని చెల్లించవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com