బిడ్డ ప్రాణం తీసిన అమ్మ హైహీల్స్..
- May 07, 2018
హైహీల్స్ వేసుకుంటే అడుగులు తడబడతాయి. మామూలుగా నడవడమే కష్టం అనుకుంటే చంకలో పిల్లాడిని ఎత్తుకుని మరీ హైహీల్స్ వేసుకుని పెళ్లికి వెళ్లింది ఓ తల్లి. పట్టు తప్పి పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ముంబైలోని ఉల్హాస్ నగర్ ఏరియాలో మహ్మద్ షేక్ కుటుంబం బంధువుల ఇంట్లో పెళ్లికని వెళ్లారు. కుటుంబంలోని ఫెమిదా షేక్ పెళ్లిలో అటూ ఇటూ తిరిగింది సందడి చేసింది. పెళ్లి కూడా అయిపోయింది. తిరిగి వెళదామని వస్తోంది. నడకలో బ్యాలెన్స్ తప్పింది. చంకలో ఉన్న బిడ్డ కాస్తా జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ పసివాడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు నిర్థారించారు. హైహీల్స్ కారణంగానే బిడ్డను కోల్పోయానని తల్లి ఫెమిదా కన్నీరు మున్నీరవుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..