యు.ఏ.ఈ:వాట్సాప్ వాయిస్ నోట్‌పై హెచ్చరిక
- May 25, 2018
యు.ఏ.ఈ:వాట్సాప్ వంటి యాప్‌ల ద్వారా టెక్స్ మెసేజ్‌లను పంపి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు అక్రమార్కులు. తాజాగా వీరు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. వాట్సాప్‌లో వాయిస్ నోట్ ద్వారా అమాయకుల్ని మోసం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. 200,000 దిర్హామ్‌లు గెల్చుకున్నారంటూ యూఏఈలోని ప్రముఖ హైపర్ మార్కెట్ ఛెయిన్ పేరుతో వాయిస్ నోట్స్‌ని సర్క్యులేట్ చేస్తున్నారు. లులు హైపర్ మార్కెట్ పేరుతో ఈ దుష్ప్రచారం జరుగుతోంది. అయితే లులు సంస్థ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. లులు సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టబోదని ఆ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. తమ సంస్థ నుంచి ఎవరూ ఫోన్ చేయడంగానీ, టెక్స్ట్ మెసేజ్‌లు చేయడంగానీ, వాయిస్ నోట్స్ పంపడంగానీ జరగదనీ, అలా ఎవరైనా ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్, బ్యాంక్ డిటెయిల్స్ అడిగితే తమకు సంబంధం లేదని లులు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..