దోఫార్ లో 250 మందికి పైగా కార్మికుల తరలింపు
- May 26, 2018
మెకును సైక్లోన్ తీవ్రత నేపథ్యంలో 260 మంది కార్మికుల్ని సలాలా పోర్టులోని బోట్స్ నుంచి ఖాళీ చేయించారు. విలాయత్ ఆఫ్ మిర్బాత్ నుంచి 16 మంది వలసదారుల్ని రక్షించారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ వివరాల్ని వెల్లడించింది. కార్మికులు వుడెన్ ఫిషింగ్ మరియు కమర్షియల్ బోట్స్‌లో వున్నారని, వారిని రక్షించామని అధికారులు తెలిపారు. బోట్లు సలాలా పోర్టులో లొకేట్ అయ్యాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాయల్ ఒమన్ పోలీసులు వారిని తరలించడంలో సహాయ సహకారాలు అందించారు. మరోపక్క సెర్చ్ అండ్ రెస్క్యూ పర్సనల్ - పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ 16 మంది వలసదారుల్ని రక్షించింది. వారిని సురక్షిత షెల్టర్స్‌కి తరలించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







