ఖతార్‌ వ్యాప్తంగా ఎంఈసీ తనిఖీలు

- May 31, 2018 , by Maagulf
ఖతార్‌ వ్యాప్తంగా ఎంఈసీ తనిఖీలు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌, సర్‌ప్రైజ్‌ ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్స్‌ని ప్రారంభించింది. స్వీట్లు, నట్స్‌, గారాంగావ్‌ యాక్ససరీస్‌ వంటివాటిని విక్రయించే ఔట్‌లెట్స్‌ ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు ఖతార్‌ వ్యాప్తంగా జరుగుతున్నాయి. లా నంబర్‌ 8 - 2008 కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌కి తగ్గట్టుగా ఆయా ఔట్‌లెట్స్‌ పనిచేస్తున్నాయో లేదో ఈ తనిఖీల్లో గుర్తిస్తారు. పవిత్ర రమదాన్‌ మాసానికి ముందు, అలాగే పవిత్ర రమదాన్‌ మాసంలో ఈ తనిఖీలు జరగడం సర్వసాధారణం. మార్కెట్‌లో అక్రమాలకు తావు లేకుండా, వినియోగదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడటమే ఈ తనిఖీల ఉద్దేశ్యం. ఇప్పటిదాకా జరిగిన తనిఖీల్లో కొన్ని ఉల్లంఘనలు నమోదయ్యాయి. వాటికి సంబంధించి 8 జరీమానాల్ని కూడా విధించారు. తూకంలో తేడాలు, అరబిక్‌ ఇన్వాయిస్‌లు లేకపోవడం వంటి ఉల్లంఘనల్ని ప్రధానంగా నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 3,000 నుంచి 1 మిలియన్‌ ఖతారీ రియాల్స్‌ వరకు జరీమానా విధించే అవకాశం వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com