‘నవాబ్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన హీరో శింబు

- June 02, 2018 , by Maagulf
‘నవాబ్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన హీరో శింబు

ఇటీవల కాలం ఒక్క ‘ఓకె బంగారం’ సినిమా తప్ప మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. చెలియా సినిమాతో నిరాశపరిచిన ఆయన తన తదుపరి చిత్రం నవాబ్‌ షూటింగ్‌ను శరవేగంగా ముగించేస్తున్నారు. భారీ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మణి చాలా వేగంగా కంప్లీట్‌ చేస్తున్నారు. శింబు, అరవింద్‌ స్వామి, విజయ్‌ సేతుపతి, అరుణ్‌ విజయ్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం సెర్బియాలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో తన పోర్షన్‌ షూటింగ్‌ను పూర్తి చేశారు శింబు. శింబు షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తారని, అనుకున్న సమయానికి సినిమా పూర్తికాదన్న అపవాదు ఉంది. అయితే అలాంటి రూమర్స్‌కు చెక్‌ పెడుతూ శింబు కూడా తన పోర్షన్‌ అనుకున్న సమయానికే పూర్తి చేశారు.

ఈ సినిమాకు సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రాఫర్‌ గా పని చేస్తున్నారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నారు. సోషల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా న్యూక్లియర్‌ ప్లాంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com