నార్వే, స్విస్‌లో 'కాలా' ప్రదర్శనపై నిషేధం!

- June 02, 2018 , by Maagulf
నార్వే, స్విస్‌లో 'కాలా' ప్రదర్శనపై నిషేధం!

ఒకవైపు కర్ణాటకలో 'కాలా' చిత్రాన్ని విడుదల కానివ్వమని అక్కడి ఫిలిం ఛాంబర్‌ తేల్చిచెబితే... మరోవైపు విదేశాల్లో సైతం ఈ చిత్రానికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తూత్తుకుడిలో పోలీసు కాల్పులను సమర్థిస్తూ, ఆందోళనకారులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ విమర్శించటాన్ని ఖండిస్తూ, నార్వే, స్విట్జర్లాండ్‌లో 'కాలా' ప్రదర్శనపై నిషేధం విధించాలని అక్కడి తమిళ సినీ పంపిణీ దారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. 'కాలా' చిత్రాన్ని నార్వే, స్విట్జర్లాండ్‌లోని తమిళులెరవరూ చూడరని, ఈ పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని ప్రదర్శించబోమని నార్వే తమిళ చిత్రాల పంపిణీదారుల సంఘం సభ్యుడు వశీకరన్‌ శివలింగం ఓ ప్రకటన జారీ చేశారు. ఇదే రీతిలో స్విట్జర్లాండ్‌లోని తమిళ సంస్థలు సైతం 'కాలా' చిత్రప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేయడంతో ఆ చిత్రం విడుదల కావటం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఈనెల 7వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో 'కాలా' విడుదల కావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com