క్యాన్సర్ హాస్పటల్లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు...

- June 10, 2018 , by Maagulf
క్యాన్సర్ హాస్పటల్లో బాలకృష్ణ జన్మదిన వేడుకలు...

నటసింహ బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలను బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చిన్నారుల సమక్షంలో జరుపుకున్నారు.. ఈ సందర్భంగా బాలయ్య 58 కేజీల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తో పలువురు ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన రక్త దానం శిబిరంలో పలువరు బ్లడ్ డోనేట్ చేశారు.. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తన పుట్టినరోజున అభిమానులు రక్తదానం చేయడం సంతోషకరమని అన్నారు. నందమూరి అభిమానులు ఇతరులకు ఆదర్శంగా ఉంటారని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్‌ పేరు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉందని బాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్న దృఢ సంకల్పం ఎన్టీఆర్‌ సొంతమని పేర్కొంటూ బసవతారకం ఆస్పత్రిలో అధునాతన పరికరాలు సమకూర్చామని వెల్లడించారు. 40 పడకలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి ఇప్పుడు 515 పడకలకు చేరిందని తెలిపారు.. రోజురోజుకూ క్ఆన్సర్‌ బాధితులు పెరుగుతుండటం బాధాకరంగా ఉందన్నారు. త్వరలోనే అమరావతిలోనూ కేన్సర్‌ ఆస్పత్రి నిర్మిస్తున్నామని ప్రకటించారు.. కాగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా పలువరు రాజకీయ, సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com