'మా' ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్
- June 10, 2018
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) హెల్త్ క్యాంప్ ప్రతి నెల రెండో ఆదివారం నిర్వహిస్తున్నది.. దీంతో ఈరోజు రెండో ఆదివారం కావడంతో మా ఆధ్వర్యంలో గ్లోబల్ హాస్పిటల్ సిబ్బంది హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగింది..మా సభ్యులకు ECG, 2D ECO, RBS, BP, Height, Weight మొదలయిన పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.. కార్డియాలజీ నిపుణుడు డా.కిరణ్ , జనరల్ ఫిజిషియన్ డా.సతీష్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ వి.కె.నరేష్, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, హెల్త్ కమిటీ చైర్మన్ నాగినీడు , కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







