రోబో 2.0 సినిమా మరోసారి వాయిదా.
- June 11, 2018
సైన్స్ ఫిక్షన్ సినిమా 2.0. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తారాగణం. శంకర్ దర్శకుడు. మైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర నిర్మాణ వ్యయం సుమారు 450 కోట్లు. ఇంత బడ్జెట్‌తో భారతీయ సినిమా రాలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకునే దర్శకుడు శంకర్. రోబో (2010) విజయం ఇచ్చిన ఉత్సాహంతో 2.0 చిత్రాన్ని ప్లాన్ చేశారు. 2015లో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడి ప్లానింగ్ ప్రకారం 2017లోనే ఈ సినిమా రిలీజ్ కావాలి. 2017 అక్టోబర్‌లో ఆడియోను దుబాయ్‌లో అట్టహాసంగా రిలీజ్ చేశారు. సినిమా విడుదల మాత్రం తరచుగా వాయిదా పడుతోంది. 2018 జనవరి 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 27 అన్నారు. చివరగా ఆగస్టు 15న 2.0 ప్రేక్షకుల ముందుకువస్తుందని వెల్లడించారు. కానీ ఇదీ జరిగేట్టు లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల ఆరు నెలలు వాయిదా పడింది.
2019లోనే ప్రేక్షకుల ముందుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 2.0 షూటింగ్ పార్ట్ మొత్తం ఎప్పుడో పూర్తయింది. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ కబాలి, కాలా సినిమాలను పూర్తిచేశారు. తాజాగా కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
2.0 విడుదల ఆలస్యానికి సిజి వర్క్ పూర్తికాకపోవడం కారణం అని తెలుస్తోంది. దర్శకుడి సంతృప్తి మేరకు వర్క్ లేని కారణంగా మళ్లి మళ్లి చేయాల్సి వస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. ఆలస్యం కారణంగా బడ్జెట్ కూడా అమాంతం పెరిగింది. తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మరికొంత కాలం ఆగాల్సిందే.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్