క్యామెడీ, హర్రర్ గా రానున్న మిస్టర్ హోమానంద్
- June 11, 2018
హోమానంద్, పావని జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ హోమానంద్. జై.రామ్‌కుమార్ దర్శకుడు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను, బిగ్ సీడీని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.
మంత్రి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నా. కొత్తవాళ్ళు అయినప్పటికీ బాగా నటించారు. ట్రైలర్ బావుంది. సినిమా పెద్ద విజయం సాధించి, అందిరకీ మంచి పేరు తేవాలి అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సినిమాను అనుకున్న టైమ్‌లోనే పూర్తిచేశాం. బాగా వచ్చింది. పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ కామెడీ హారర్ జోనర్ సినిమా ఇది. గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. హీరో కొత్త అయినప్పటికీ బాగా నటించాడు. అన్ని వర్గాలవారికి నచ్చే సినిమా ఇది అని చెప్పారు. పాటలు పెద్ద హిట్ అవుతాయని సంగీత దర్శకుడు బోలేషావళి చెప్పారు. ఈ కార్యక్రమంలో హోమానంద్, మల్కాపురం శివకుమార్, రాజావన్నెం రెడ్డి కూడా మాట్లాడారు. ఇతర పాత్రల్లో సుమన్, ప్రయాంక శర్మ, రఘు కారుమంచి, చిట్టిబాబు, వివేక్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!