తాత్కాలికంగా జుమైరా బీచ్ మూసివేత
- June 16, 2018
దుబాయ్ జుమైరా బీచ్ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా వుండడంతోనే పబ్లిక్ని ఈ బీచ్‌లోకి అనుమతివ్వడంలేదని అధికారులు వివరించారు. దుబాయ్ మునిసిపాలిటీ - ఎమర్జన్సీ అండ్ రెస్క్యూ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆన్సైట్ అధికారి మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు ఈ బీచ్ మూసివేస్తారు. రిప్ కరెంట్ బలంగా వీస్తున్న నేపథ్యంలో సముద్రంలో ఈత ప్రమాదకరమని అధికారులు చెప్పారు. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారమంతా సముద్రం రఫ్‌గా వుంటుంది. రిప్ టైడ్స్ ప్రమాదకరంగా వుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీచ్‌లు ఏమాత్రం సురక్షితం కాదు కాబట్టే, సందర్శకులకు అనుమతినివ్వడంలేదని ఓ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్