ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' సినిమా

- June 17, 2018 , by Maagulf
ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' సినిమా

ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' హైదరాబాద్‌: 'గీతాంజలి' చిత్రంలో దెయ్యం పాత్రలో నవ్వులూ పూయిస్తూ భయపెట్టారు నటి అంజలి. 2014లో విడుదలైన ఈ సినిమాకు రాజ్‌ కిరణ్ దర్శకత్వం వహించారు. హాస్యనటులు శ్రీనివాస్‌, మధునందన్‌, హర్షవర్ధన్‌ రానే, బ్రహ్మానందం, అలీ కీలక పాత్రలు పోషించారు. రావు రమేశ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. రచయిత కోనవెంకట్‌ 'గీతాంజలి 2' తీయబోతున్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రవాస భారతీయుడు దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ప్రేక్షకులను థ్రిల్‌ చేయడానికి సన్నద్ధమైనట్లు చెప్పారు. ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com