జులై ఆఖరులో 'జరుగండి'

- June 19, 2018 , by Maagulf
జులై ఆఖరులో 'జరుగండి'

జులై ఆఖరులో 'జరుగండి' చెన్నై, న్యూస్‌టుడే: 'బలూన్‌' చిత్రం తర్వాత జై నటిస్తున్న సినిమా 'జరుగండి'. దీనికి వెంకట్‌ప్రభు శిష్యుడు పిచ్చుమణి దర్శకత్వం వహిస్తుండగా నటుడు నితిన్‌ సత్య నిర్మిస్తున్నారు. బద్రి కస్తూరి సహ నిర్మాత. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఏఆర్‌ మురుగదాస్‌ ఆవిష్కరించారు. ఇదిలా ఉండగి చిత్రీకరణ పూర్తికావడంతో సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై దర్శకుడు పిచ్చుమణి, నిర్మాత నితిన్‌ సత్య విలేకరులతో మాట్లాడుతూ 'నటుడు జై సరైన సమయానికి షూటింగ్‌కు రారు. ఆయన వల్ల చాలా సమస్యలొస్తాయని చాలా మంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. పనిలో మాత్రం ఆయన చాలా స్పష్టంగా ఉంటారు. ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా వెళ్లడమే సరి. వాస్తవానికి ఈ సినిమాను 46 రోజుల్లో పూర్తి చేశాం.
జై సరైన సమయానికి షూటింగ్‌కు వచ్చి పూర్తి చేయించారు. జీవితంలో ఎలాగైనా స్థిరపడాలని అనుకునే వ్యక్తి.. వ్యాపార నిమిత్తం బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేసుకుంటారు. కానీ అక్కడ పలు సమస్యలు ఎదురవుతాయి.
ఆయన రుణం తీసుకుని, జీవితంలో ఎలా ముందుకు సాగాడనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమాను రూపొందించాం. రెబా కథానాయికగా నటించారు. ఇలవరసు, బోస్‌ వెంకట్‌, అమిత్‌, జయకుమార్‌, నందా శరవణన్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. కథానాయకుడి జీవితంలో అంతా వేగంగా సాగిపోతుంటాయి.
అందుకు తగ్గ పేరు కోసం వెతుకుతుండగా 'జరుగండి' అనే తెలుగు పదం గుర్తుకొచ్చింది. ఈ పదం అన్నిభాషల వారికి తెలిసిందే. అందుకే రెండో మాట లేకుండా ఆ పేరు పెట్టేశాం. ఇక సినిమా ట్రైలర్‌ కూడా అద్భుతంగా వచ్చింది.త్వరలోనే విడుదల చేయనున్నాం. ఈ చిత్రాన్ని జులై ఆఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం జైతోపాటు మాకు మంచి బ్రేక్‌నిస్తుందని' పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com