టీఆర్ఎస్ పార్టీ ఎన్నారై ఖతర్ శాఖ పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు

- June 21, 2018 , by Maagulf

ఖతర్:టీఆర్ఎస్ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఖతర్ శాఖ పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు.17వ టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్బంగా పార్టీ ఎన్నారై అఫైర్స్ అడ్వైసర్ ఎంపీ కవిత సమక్షంలో ఆడ్‌హక్ కమిటీని ప్రకటించారని తెలిపారు.అందులో ఆత్మకూర్ గ్రామానికి చెందిన సుందరగిరి శంకర్ గౌడ్ ఎంపికయ్యారు.

సీఎం కేసిఆర్ రాష్ట్ర బడ్జెట్‌లో ఎన్నారైల సంక్షేమం కోసం పెట్టిన రూ.100 కోట్ల బడ్జెట్ నుంచి 50 కోట్ల నిధులతో ప్రత్యేక సెల్ త్వరలో ఏర్పడబోతుందని అన్నారు.ఈ సెల్ ప్రత్యేకంగా గల్ఫ్‌లోని ఎన్నారైల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.త్వరలో గల్ఫ్‌లోని అన్నీ దేశాలలో పర్యటించి అక్కడ తెలంగాణ ఎన్నారైలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు.టీఆర్ఎస్ ఖతర్ కమిటీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.ప్రెసిడెంట్‌గా శ్రీధర్ అబ్బగౌని, వైస్‌ప్రెసిడెంట్ శోభన్ బండారపు,  నర్సయ్య దొనికెన, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ పొడకంటి, ఇండస్ట్రియల్ ఏరియా ఇన్‌చార్జి శంకర్ సుందరగిరి, ట్రెజరర్ ప్రమోద్ కెతే, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నరేష్ కోరం, మైనారిటీస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా బిన్ అమర్, కోఆర్డినేటర్ - అభిలాష్ బండి, యూత్ ప్రెసిడెంట్- మహేందర్ చింతకుంట,యూత్ వైస్ ప్రెసిడెంట్ -విష్ణు వర్ధన్‌రెడ్డి, మైనారిటీ వైస్ ప్రెసిడెంట్- సయ్యద్ ముస్తాక్, కల్చరల్ హెడ్- సంతోష్ కుమార్, గట్టు-లాజిస్టిక్స్ హెడ్‌గా వెంకట్ కృష్ణ నియమితులయ్యారు.
ఈ కమిటీలో ఎన్నుకున్నందుకు దేశ్ కి నేత CM కెసీర్ కి, ఎంపీ కవితకి మరియు మహేష్ బిగాలకి కృజ్ణతలు తెలిపారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్.కామ్,ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com