ఛీటింగ్: కేరళ వ్యక్తి అరెస్ట్
- June 22, 2018
కేరళ పోలీస్, ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖతార్ రాయల్ ఫ్యామిలీని 5.6 కోట్ల మొత్తానికి చీటింగ్ చేసినట్లు ఇతనిపై అభియోగాలు మోపబడ్డాయి. ఖతార్ మ్యూజియం అథారిటీస్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు జూన్ 13న కేసు రిజిస్టర్ చేశామని పోలీసులు వివరించారు. రాయల్స్‌కి చెందిన ఇ-మెయిల్స్‌ని ఫేక్ చేసి, వాటి ద్వారా నిందితుడు తన ఖాతాలోకి డబ్బుల్ని తరలించుకున్నట్లు పోలీసులు గుర్తించి, ఆ అకౌంట్నఇ బ్లాక్ చేసి, నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ చీటింగ్‌లో మరికొంతమంది వుండి వుండొచ్చన్న అనుమానంతో కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సునీల్ మీనన్, త్రిస్సూర్‌కి చెందిన వ్యక్తి. ఛీటింగ్ ద్వారా సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని కారు కొనుగోలు చేసేందుకు, సుమారు 20 లక్షల్ని ఇతర అవసరాల కోసం వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్