ఇథియోపియా:ప్రధాని ర్యాలీలో భారీ పేలుడు...
- June 23, 2018
అడిస్ అబబా: ఇథియోపియా నూతన ప్రధాని అబే అహ్మద్ నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు చోటుచేసుకున్నది. అడిస్ అబబాలో జరిగిన ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. ఆ సభలో పేలుడు జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రసంగం పూర్తి కాగానే ప్రధాని అబే అహ్మద్‌ను సెక్యూర్టీ దళాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. పేలుడులో అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ప్రధాని హెయిలిమరియమ్ డిసలేన్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఆయనకు వారసుడిగా అబే అహ్మద్ ఆ బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని ఒరోమో తెగకు చెందిన మొదటి నేతగా అబే అహ్మద్‌ను గుర్తిస్తున్నారు. ఇథియోపియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, రాజకీయ రెబల్స్‌ను వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ర్యాలీలో జరిగిన పేలుడులో పలువురు చనిపోయినట్లు ఆ తర్వాత ప్రధాని ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా