చినబాబు ఆడియో వేడుకలో కార్తి

- June 23, 2018 , by Maagulf
చినబాబు ఆడియో వేడుకలో కార్తి

కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం "చినబాబు". ఈ చిత్రాన్ని కార్తి సోదరుడు, ప్రముఖ సౌత్ హీరో సూర్య తన సొంత బేనర్ 2డి ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మించారు. ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తి రైతు పాత్రలో కనపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ప్రమోషన్లో భాగంగా వైజాగ్‌లో ఆడియో రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. తమిళంలో కడైకుట్టి సింగం పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో 'చినబాబు' పేరుతో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో మిరియాల రవీందర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.
ఫార్మర్స్ 
రైతుల గురించి తీసిన సినిమా: సూర్య
"రైతుల గురించి చినబాబు సినిమాను నిర్మించడం జరిగింది. అందరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. తమ్ముడితో సినిమా చెయ్యడం కల నిజం అయినట్లు ఉంది. సింగం3 సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ వచ్చాను అప్పుడు మీరు చూపించిన ప్రేమ మర్చిపోలేను. నా కంటే కార్తీ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్న. కలలు కనండి వాటిని సాధించండి. పాజిటివ్ గా ఉంటె అన్నీ సాధ్యం అవుతాయి. చినబాబు అందరికి నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com