దిలీప్ రాకతో 'అమ్మ'కు పలువురు ఆర్టిస్టులు రాజీనామా.!
- June 27, 2018
కొన్ని రోజుల కిందట దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్‌ను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన వెనుక మలయాళ ప్రముఖ హీరో దిలీప్ ఉన్నాడని బయటపడడంతో అది మరింత సంచలనంగా మారింది. దీంతో దిలీప్‌ను `అసోసియేషన్ ఫర్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్` (అమ్మ) నుంచి బహిష్కరించి జైలుకు పంపించారు.
అనంతరం దిలీప్ బెయిల్‌పై తిరిగి వచ్చాడు. దిలీప్‌ను మళ్లీ `అమ్మ`లో చేర్చుకోవాలనే విషయంపై మలయాళ చిత్రపరిశ్రమలో కొందరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మరో వివాదం మొదలైంది. సగం మంది దిలీప్‌కు వ్యతిరేకంగా, మరికొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం `అమ్మ`కు స్టార్ హీరో మోహన్‌లాల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మోహన్‌లాల్ కూడా దిలీప్‌కు అనుకూలంగానే ఉన్నారు. నిజానికి మోహన్‌లాల్ వల్లే ఈ ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పలువురు ఆర్టిస్టులు `అమ్మ`కు రాజీనామా లేఖలు సమర్పించారు. వీరిలో అత్యాచారానికి గురైన హీరోయిన్‌తోపాటు రమ్య నంబీశన్, రీమా కల్లింగల్, గీతూ మోహన్‌దాస్ వంటి ప్రముఖ నటీమణులు ఉన్నారు. దిలీప్‌ను `అమ్మ`లోకి తిరిగి తీసుకుంటే తమ రాజీనామాలను ఆమోదించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ వివాదానికి మోహన్‌లాల్ ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!