పరువు తీశారని... జర్నలిస్టుల కాల్చివేత
- June 28, 2018
తన ప్రతిష్ఠకు భంగం కల్గించారనే అక్కసుతో రగిలిపోయిన ఓ వ్యక్తి ఏకంగా పత్రిక ఆఫీసులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అయిదుగురు జర్నలిస్టులు అక్కడిక్కడే మరణించారు. మేరీలాండ్ రాష్ట్రంలోని అన్నా పోలిసు కేంద్రంగా వెలువడే కేపిటల్ గెజిట్ పత్రిక ఆఫీసులో ఈ దుర్ఘటన జరిగింది. న్యూస్ డెస్క్‌లో వార్తలను సిద్ధం చేసే పనిలో జర్నలిస్టులు బిజీగా ఉన్న సమయంలో జారడ్ అనే వ్యక్తి కార్యాలయంలోకి చొరబడ్డాడు... ఆఫీసు బయట గ్లాస్ డోర్ నుంచే కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. దీంతో ఒక్కసారిగా జర్నలిస్టులు పరుగులు పెట్టారు. కాల్పులకు అయిదుగురు చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఈ ఘటన జరిగింది కోపంతో... 2012లో జారడ్ వారెన్ రామోస్ అనే వ్యక్తిపై కేపిటల్ గెజిట్ ఓ వార్త ప్రచురించింది. ఏడాది కాలంగా ఓ మహిళను సామాజిక మీడియాలో ఇతను అసభ్య పదజాలంతో, పేర్లతో ఆమెను హింసిస్తున్నాడని రాసింది. దీంతో తన పరువుకు నష్టం కల్గించారని పత్రికపై కేసు వేశాడు జారడ్. వార్త రాయడానికి అయిదు రోజుల ముందు పత్రిక కార్యాలయానికి వచ్చిన జారడ్... తప్పు జరిగిందని క్షమించమని కోరాడు. అయినా పత్రిక ఆ కథనాన్ని ప్రచురించింది. 2013లో కోర్టు జారడ్ను దోషిగా తేల్చింది. దీనిపై జారడ్ అప్పీలు వెళ్ళగా అక్కడ ఆయన అప్పీల్‌ను కొట్టేశారు. అప్పటి నుంచి కసిగా ఉన్న జారడ్ ఇవాళ ఆఫీసులోకి చొరబడి కాల్పులు జరిపాడు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్