మానససరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం
- July 02, 2018
కైలాస మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న విజయవాడ చిట్టినగర్‌కు చెందిన 16 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండో-టిబెట్ సరిహద్దులో మంచు తుఫాన్ కారణంగా యాత్రికులు ఎక్కడికీ కదలేని పరిస్థితి ఉందని ఏపీ భవన్ కమిషనర్ శ్రీకాంత్‌కు నేపాల్ భారతీయ ఎంబసీ కార్యాలయం తెలిపింది. తుఫాన్ తగ్గిన వెంటనే యాత్రికులను తిరిగి పంపుతామని పేర్కొంది. యాత్రికులకు వైద్య సదుపాయాలు అందజేస్తున్నామని నేపాల్ భారతీయ ఎంబసీ కార్యాలయం తెలిపింది.
మానససరోవర్ యాత్రకు వెళ్లిన 16 మంది యాత్రికులు ఇండో-టిబెట్ సరిహద్దులో మంచు తుఫాన్ రావడంతో అక్కడే ఉండిపోయారు. ముందుకు వెళ్లలేక...వెనక్కి రాలేక యాత్రికుల అవస్థలకు గురయ్యారు. విషయం తెలిసిన కలెక్టర్ లక్ష్మీకాంతం బాధితులతో ఫోన్‌లో మాట్లాడారు. యాత్రికులకు మందులు, ఆహారం సరఫరా చేయాలని ఏపీ భవన్ అధికారులను కోరారు. అయితే తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు నేపాల్ భారతీయ ఎంబసీ ప్రకటించడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా