' రంగస్థలం ' శతదినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు..

- July 03, 2018 , by Maagulf
' రంగస్థలం ' శతదినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు..

ఒకప్పుడు మా సినిమా 100 రోజులు ఆడింది..50 రోజులు ఆడింది..అని అభిమానులు గొప్పగా చెప్పుకునే వారు..కానీ ఈ మధ్య కనీసం 25 రోజులు ఆడిందనే మాట వినిపించడం లేదు. ఇలాంటి తరుణం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి 100 రోజులు మా సినిమా ఆడిందని గొప్పగా చెప్పుకునేలా రంగస్థలం తో నిరూపించాడు. 1980 కాలం నాటి కథ గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం లో సక్సెస్ అయ్యింది.

ముఖ్యం గా చరణ్ నటన కు మెగా అభిమానులే కాదు యావత్ సినీ అభిమానులు ఫిదా అయ్యారు. అలాంటి గొప్ప నటన తో సినిమాకు ప్రాణం పోసాడు. వరల్డ్ వైడ్ గా మర్చి 30 , 2018 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విజయవంతంగా 95 పూర్తి చేసుకొని 100 రోజుల వైపు పరుగులు పెడుతుంది. ఈ సందర్బంగా మెగా అభిమానులు రంగస్థలం శతదినోత్సవ వేడుకలను గ్రాండ్ గా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ ప్రధాన థియేటర్ సుదర్శన్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా నడుస్తున్న పలు థియేటర్లలో శతదినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగా నాన్ బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసి చరణ్ కెరియర్ లోనే ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో విడుదలైన ఈ మూవీ లో చరణ్ కి జోడిగా సమంత నటించగా , ఆది , జగపతి బాబు , అనసూయ లు ప్రధాన పాత్రల్లో నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com