మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సినిమా తోనే!

- July 04, 2018 , by Maagulf
మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సినిమా తోనే!

నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో 'ఎన్టీఆర్' బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 5 నుంచి మొదలుకానుంది. 

ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ఞ నటిస్తున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ బయోపిక్ కోసం బొద్దుగా ముద్దుగా ఉన్న మోక్షజ్ఞ సైజ్ తగ్గే పనిలో పడ్డాడంటూ వార్తలు చక్కర్లుకొడుతున్నాయి.    ఫిట్‌నెస్ కోసం సింగపూర్‌‌లో కసరత్తులు చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com