ఎన్టీఆర్‌ సతీమణి పాత్రలో ఆమే!

- July 05, 2018 , by Maagulf
ఎన్టీఆర్‌ సతీమణి పాత్రలో ఆమే!

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు 'యన్‌టిఆర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రీల్‌ లైఫ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఇందులో ఎవరెవరు ఏ పాత్రల్లో నటించబోతున్నారు? అన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఫిక్స్‌ అయిపోయారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోపక్క సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు, నాగచైతన్య, రానా, శర్వానంద్‌ల పేర్లు కూడా వినపడుతున్నాయి. అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన మోహన్‌బాబు కూడా 'యన్‌టిఆర్‌'లో కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.ప్రముఖ నటుడు రాజశేఖర్‌కీ ఓ పాత్ర దక్కిందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను హిందీలోనూ విడుదల చేయనున్నారు. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ప్రమాణ స్వీకారం చేశారు.దీన్ని సెంటిమెంట్‌గా భావించి ఈ చిత్రాన్ని 2019 జనవరి 9న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com