థాయ్‌లాండ్:బోటు బోల్తా 37 మంది మృతి
- July 06, 2018
ఫుకెట్: పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుకెట్ దీవికి సమీపంలో 105 మందితో గురువారం సముద్రంలోకి వెళ్లిన బోటు బోల్తా కొట్టడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది పర్యాటకుల్ని అధికారులు రక్షించగలిగారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి 16 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడటంతో ఫీనిక్స్ అనే బోటు గురువారం పల్టీ కొట్టిందని ఫుకెట్ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. అలలు ఎగిసిపడే అవకాశముందని హెచ్చరించినప్పటికీ బోటు యజమాని, కెప్టెన్ తమ సూచనల్ని పెడచెవిన పెట్టారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా చైనీయులే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!