ఘనంగా వైఎస్‌ఆర్‌ 69వ జయంతి..

- July 07, 2018 , by Maagulf
ఘనంగా వైఎస్‌ఆర్‌ 69వ జయంతి..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సతీమణి భారతి, సోదరి షర్మిల, కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి సహా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. 
 
పాదయాత్రలో ఉన్న కారణంగా జగన్ ఇక్కడికి రాలేకపోయారు. ప్రజాసంకల్పయాత్రలోనే మహానేతకు నివాళులు అర్పించనున్నారు.  వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయమ్మ సహా అంతా నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇవాళ ప్రార్థనల సందర్భంగా విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. అటు, పులివెందులలో జరిగిన కార్యక్రమంలో వివేకానందరెడ్డి.. వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. 
 
వైఎస్ జయంతి సందర్భంగా జగన్ ఓ ట్వీట్ చేశారు. ఇవాళ పాదయాత్రలో 2500 కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది యాధృచ్చికమే కాదు.. ఏపీ ప్రజలతోపాటు నాన్న ఆశీస్సులు కూడా ప్రతిబింబించేలా ఉందన్నారు. హ్యాపీ బర్త్‌డే నాన్న అంటూ, ఎప్పుడూ అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ జగన్ రాసుకొచ్చారు.
 
ప్రస్తుతం జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. మండపేట నియోజకర్గం నుంచి ముందుకు సాగుతున్న ఆయన.. ఇవాళ పసలపూడి నుంచి యాత్ర ప్రారంభింస్తారు. చెల్లూరు మీదుగా మాచవరం వరకూ నడక సాగుతుంది. ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర 208వ రోజుకు చేరింది. వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి.. జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అటు, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com