ఈజిప్ట్ విమాన దుర్ఘటనకు కాక్‌పిట్ అగ్నిప్రమాదము కారణం
- July 07, 2018
కైరో:రెండేళ్ళ క్రితం పారిస్-కైరో ఈజిప్ట్ ఎయిర్‌కి చెందిన విమానం కూలిపోవడానికి కాక్‌పిట్‌లో సంభవించిన అగ్ని ప్రమాదమే కారణమై వుండవచ్చని ఫ్రాన్స్ దర్యాప్తు అధికారులు తెలిపారు. 2016 మే లో సంభవించిన ఈ దుర్ఘటనలో విమానంలో వున్న 66మందీ చనిపోయారు. వీరిలో 12మంది ఫ్రాన్స్ జాతీయులు వున్నారు. ఈ విమానం కూలిపోవడానికి విద్రోహక చర్య కారణమై వుండవచ్చని, మృతదేహాల అవశేషాల్లో పేలుడు రసాయనాలు కనుగొన్నామని ఈజిప్ట్ అధికారులు నిర్ధారించారు. ఆ దర్యాప్తు నిర్ధారణలను తిరస్కరిస్తూ ఫ్రాన్స్‌కి చెందిన బిఇఎ ఎయిర్ యాక్సిడెంట్ దర్యాప్తు సంస్థ పై వివరాలతో ఒక ప్రకటన జారీ చేసింది. చాలా ఎత్తులో వుండగా, కాక్‌పిట్‌లో మంటలు చెలరేగి వుండవచ్చని, దానితో మొత్తంగా విమానమంతా మంటలు వ్యాపించి వుంటాయని భావిస్తున్నామని బిఇఎ పేర్కొంది. అయితే, ఈజిప్ట్ అధికారులు తమ తుది నివేదికను ప్రచురించలేదని, విమాన శిధిలాలపై మరింతగా దర్యాప్తు సాగించాలన్న తమ ప్రతిపాదన కూడా వారు పట్టించుకోలేదని బిఇఎ తెలిపింది. కాగా దీనిపై వెంటనే వ్యాఖ్యానించడానికి ఈజిప్ట్ ఎయిర్ అధికారులు అందుబాటులోకి రాలేదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే ఈ దుర్ఘటనకు గల కారణాలు విశ్లేషించి చర్యలు తీసుకోవాల్సి వుందని బిఇఎ.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!