అల్ అయిన్:యాక్సిడెంట్ వద్ద గుమికూడిన 9 మందికి గాయాలు
- July 08, 2018
అల్ అయిన్‌లో ఓ రోడ్డు ప్రమాదం, మరో 9 మందికి గాయాల పాలయ్యేలా చేసింది. రోడ్డు ప్రమాద స్థలిలో నిలుచుని చూస్తున్నవారిని అటువైపుగా వెళుతున్న మరో కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తొలుత రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డవారికి సహాయం చేసేందుకు వీరంతా అక్కడికి చేరారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతోనే వారంతా బయటపడ్డారు. అల్ అయిన్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ జయౌది మాట్లాడుతూ, యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో సహాయక చర్యల కోసం ముందుకొచ్చేవారు అప్రమత్తంగా వుండాలనీ, రోడ్డు మీద వచ్చే వాహనాల్ని పరిశీలించాలని, అదే సమయంలో ఎమర్జన్సీ వెహికిల్స్‌కి దారి ఇవ్వాలని సూచించారు. అత్యుత్సాహంతో రోడ్లను బ్లాక్ చేసేవారికి 1000 దిర్హామ్‌ల జరీమానా విధించే అవకాశం వుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!