తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ కొత్త సినిమా ప్రారంభం!
- July 09, 2018
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో కొత్త సినిమా సోమవారం హైదరాబాద్ నానక్‌రాం గూడలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. మాస్ మసాలా ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. సోనూ సూద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవానికి దర్శకుడు వివి వినాయక్, శ్రీవాస్, మాజీ మంత్రి దానం నాగేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రముఖ దర్శకుడు
తొలి సన్నివేశానికి వినాయక్ క్లాప్
హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి వినాయక్ క్లాప్ కొట్టగా, శ్రీవాస్ కెమెరా స్విచన్ చేశారు. తొలి సన్నివేశానికి తేజ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
బెల్లంకొండ హీరో
ఎకె ఎంటర్టెన్మెంట్స్ 17వ మూవీ
ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరి బేనర్లో వస్తున్న 17వ సినిమా ఇది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి భూపాల్ మాటలు రాస్తుండగా శీర్ష రే సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
హీరోతో రెండోది
కాజల్‌తో తేజ మూడోసారి
సినిమా ప్రారంభంతో పాటు ప్రత్యేకంగా వేసిన సెట్లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. హీరోయిన్ కాజల్‌కు తేజ దర్శకత్వంలో ఇది 3వ సినిమా కాగా, బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండో సినిమా. ఈ చిత్రంలో సోనూ సూద్‌తో పాటు అభిమన్యు సింగ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
టెక్నీషియన్స్
తెర వెనక
దర్శకత్వం: తేజ
సమర్పణ: ఎ టీవీ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణ కిషోర్ గరికపాటి
రచన: లక్ష్మి భూపాల
సంగీతం: అనూప్ రూబెన్స్
డిఓపీ: శీర్ష రే
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..