బలపడ్తున్న దిర్హామ్‌: వలసదారుల్లో ఆనందం

- July 10, 2018 , by Maagulf
బలపడ్తున్న దిర్హామ్‌: వలసదారుల్లో ఆనందం

యూఏఈలో వలసదారులు దిర్హామ్‌ బలోపేతమవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాల కరెన్సీతో పోల్చితే దిర్హామ్‌ 2018 ప్రథమార్థంలో భారీగా బలపడ్డంతో వలసదారుల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. అమెరికన్‌ డాలర్‌తో పోల్చితే ఎమిరేటీ కరెన్సీ బలపడటం, అదే సమయంలో అమెరికన్‌ డాలర్‌తో ఆయా దేశాల కరెన్సీ బలహీనపడటంతో రెమిటెన్స్‌ చేసినప్పుడు తమ దేశంలోనివారికి పంపే నగదు అధికంగా వెళుతుంది. ఇదే వలసదారుల ఆనందానికి కారణం. యూఏఈ దిర్హామ్‌తో పోల్చితే రూపాయి విలువ 18.8కి పడిపోగా, పాకిస్తానీ రూపీ 33కి పడిపోయింది. బంగ్లాదేశీ టాకా 23కి పడిపోగా, ఫిలిప్పినో పెసో 14.6కి దిగింది. ముందు ముందు యూఏఈ దిర్హామ్‌ మరింత బలపడ్తుందని కరెన్సీ అనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com