ఒకే ఇంట్లో11 మంది ఆత్మహత్య కేసులో తీవ్రంగా భయపడుతున్న పోలీసులు..
- July 10, 2018
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ రోజు వారందరు హత్యగావించారనే రూమర్లు రాగా మరోక రోజు వారు మోక్షం కోసం ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికి ఈ విషయం తేల్చేందుకు పోలీసులు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే మోక్షంపై ప్రీతీ ఉన్నప్పుడు వారు మాత్రమే చనిపోవాలి.. అలాంటప్పుడు అందర్నీ ఎందుకు చంపినట్టు, పైగా కుటుంబంలో అందరికి ఒకే అభిప్రాయం ఉండటం సాధ్యమేనా అనే కోణంలో కూడా పోలీసుల విచారిస్తున్నారు. ఇదిలావుంటే ఈ కేసును విచారిస్తున్న పోలీసుల్లో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మునుపెన్నడు తమ జీవితంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఈ కేసు విచారణ పనిలో పడి చాలా మంది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు తరచుగా బాటియా ఇంటికి వెళ్తుండటం.. పైగా ఇంటిని చూస్తే ఏదో కీడు జరుగుతుందున్న భయం వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వారు ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే అని కొందరు పోలీసులు అంగీకరిస్తున్నారు.
తాజా వార్తలు
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్