'గీత గోవిందం' సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల
- July 10, 2018అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో గీత గోవిందం అనే సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్ గా రూపొందుతుందని అంటున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల కాగా, ఇది అభిమానులలో ఆసక్తి కలిగించింది . పోస్టర్ ని చూసి అర్జున్ రెడ్డి తరహాలో ఈ సినిమాలోను డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఇక ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో పాటని విడుదల చేసేందుకు సన్నద్దమయ్యారు మేకర్స్ . 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' అంటూ సాగే ఈ పాటను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సంగీత ప్రేక్షకుల మనసులని గెలుచుకుంది. మరి ఆ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా