చి.ల.సౌ..టీజర్
- July 11, 2018అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ తాజా చిత్రం చి.ల.సౌ. అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సుశాంత్ చివరిగా ఆటాడుకుందాం.. రా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. రుహని శర్మ చి.ల.సౌ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. ఇటీవల చిత్ర టీజర్ విడుదలైంది. హీరో వర్షెన్‌కి సంబంధించిన టీజర్ అలరించింది. తాజాగా పెళ్లి కూతురు వర్షెన్‌కి సంబంధించి టీజర్ విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ ప్రతి ఒక్కరికి కత్రినా కైఫ్ కావాలి అనుకుంటారు, కాని ఎవడు రణ్‌బీర్ లా ఉండరు అని అంటుంది. టీజర్లని బట్టి చూస్తుంటే చి.ల.సౌ మూవీ మంచి ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తుంది. సుశాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తాజాగా విడుదైలన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..