సింగర్‌ని కౌగిలించుకున్నందుకు అరెస్టు
- July 15, 2018
ఓ గాయకుడిని అభిమానంతో కౌగిలించుకున్నందుకు మహిళను అరెస్టు చేశారు పోలీసులు. మహిళలపై ఆంక్షలు ఎక్కువగా ఉండే సౌదీ అరేబియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయకుడు ప్రదర్శన ఇస్తున్న సమయంలో వేదికపైకి పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కౌగిలించుకోవడమే ఆమె చేసిన నేరం. శుక్రవారం సౌదీలోని తాయిఫ్ నగరంలో ప్రముఖ గాయకుడు మాజిద్ అల్-మొహందీస్ ప్రదర్శన జరుగుతోంది. ఈ ప్రదర్శనకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ప్రదర్శన జరుగుతోన్న సమయంలో బుర్ఖా ధరించిన ఓ మహిళ వైదికపైకి పరుగెత్తుకుంటూ వెళ్లి గాయకుడిని అభిమానంతో ఆలింగనం చేసుకుంది. వెంటనే భద్రతాసిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సౌదీ చట్టాల ప్రకారం మహిళలు బహిరంగంగా తమకు పరిచయం లేని పురుషులను కలవరాదు. వారితో చనువుగా ఉండరాదు. అలా చేస్తే చట్టప్రకారం శిక్షార్హులు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆ మహిళను పోలీసులు అరెస్టుచేశారు.
అక్కడి చట్టాల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకుంటామని మక్కా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. గాయకుడిని కౌగిలించుకున్న వెంటనే అక్కడ ఉన్న భద్రతాసిబ్బంది గాయకుడిని ఆమె నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటన అనంతరం గాయకుడు తన ప్రదర్శన కొనసాగించాడు.
సౌదీ యువరాజ్ మహ్మద్ బిన్ సల్మాన్ హయాంలో మహిళలపై ఆంక్షలకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ.. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఉన్న పలు ఆంక్షలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!