ఫిఫా విజేత ఫ్రాన్స్..
- July 15, 2018
సాకర్ ప్రపంచకప్ అంతిమ సంగ్రామం ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఫిఫా విజేతగా నిలిచింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చిన్న దేశం క్రొయేషియాకు షాక్ ఇచ్చింది. 4-2 తేడాతో ఆ జట్టును మట్టికరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 18వ నిమిషంలో ఫ్రాన్స్‌కి వచ్చిన ఫ్రీకిక్లో క్రొయేషియా స్ట్రైకర్ మారియో సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. 28వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు పెరిసిచ్ గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. 38వ నిమిషంలో ఫ్రాన్స్‌కు వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని గ్రీజ్మన్ గోల్‌గా మలిచి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు.ఫస్ట్ హాఫ్‌లో ప్రత్యర్థి జట్టు గోల్‌పోస్ట్‌పై క్రొయేషియా ఏడుసార్లు దాడిచేసింది.
సెకండాఫ్‌లో ఫ్రాన్స్ దూకుడు పెంచింది. మ్యాచ్ 59, 65 నిమిషాల్లో పోగ్బా, ఎంబపె గోల్స్ చేసి తమ జట్టుకు తిరుగులేని ఆధిక్యతను అందించారు. 69వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మండుజుకిచ్ గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యతను 4-2కు తగ్గించాడు. ఈ తరుణంలో అవకాశాలు వచ్చినా.. ఒత్తడిని తట్టుకోలేక క్రొయేషియా చేజార్చుకుంది. మ్యాచ్ ముగిసేసరికి ఇరు జట్లూ మరో గోల్ చేయకపోవడంతో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!