ఫుట్ బాల్ ఫ్యాన్స్ కి పుతిన్ బంపరాఫర్ !
- July 16, 2018రష్యాలో దాదాపు నెలన్నరపాటు ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులను అలరించిన ఫిఫా వరల్డ్ కప్-2018 పోటీలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన పోరులో ఫ్రాన్స్ జట్టు క్రొయేషియాపై 4-2 తేడాతో విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. టోర్నీ సక్సెస్ కావడంతో హ్యాపీగావున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫుట్ బాల్ అభిమానులకు బంపరాఫర్ ఇచ్చేశారు. మ్యాచ్‌లను చూసేందుకు 'ఫ్యాన్ ఐడీ' కార్డులతో తమ దేశానికి వచ్చిన విదేశీయులు, ఈ ఏడాదంతా ఎలాంటి వీసా ఫీజులు చెల్లించకుండా ఎన్నిసార్లయినా రష్యా వచ్చి వెళ్లవచ్చని స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు టికెట్ కొనుగోలు చేసిన విదేశీయులు, దేశంలో దిగగానే ఈ 'ఫ్యాన్ ఐడీ' ఇస్తారు. ఈ ఐడీలు మామూలుగా అయితే, ఈ నెల 25తో ఎక్స్ పైర్ అయిపోతాయి. ఇప్పుడీ ఫ్యాన్ ఐడీ చూపించి, సంవత్సరం చివరి వరకూ ఎన్నిసార్లయినా పర్యటించవచ్చని పుతిన్ ఆఫర్ ఇచ్చారు. ఇది పుతిన్ మైండ్ లో పుట్టిన ఈ బిజినెస్ ఆలోచన వల్ల తమ దేశానికి టూరిస్టుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం