బహ్రెయిన్:ముగ్గురు డ్రగ్ అడిక్ట్స్కి జైలు శిక్ష
- July 16, 2018
బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్టు ముగ్గురు బహ్రెయినీలకు జైలు శిక్ష విధించింది. డ్రగ్స్‌కి బానిసలైనందుకుగాను వీరికి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. వీరిలో 40 ఏళ్ళ వ్యక్తిపై డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఆ కేసుల్ని కొట్టివేశారు. పోలీసులకు డ్రగ్స్‌కి సంబంధించిన సమాచారం అందించినందుకుగాను అతనిపై ఆ కేసులు రద్దు చేయడం జరిగింది. ఏడాది జైలు శిక్ష, 500 బహ్రెయినీ దినార్స్ జరీమానాను న్యాయస్థానం 'డ్రగ్స్ అడిక్ట్' అభియోగాల నేపథ్యంలో విధించడం జరిగింది. 37 ఏళ్ళ వ్యక్తికీ ఇదే శిక్ష విధించింది. మూడో వ్యక్తికి మాత్రం 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా, ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్