షేక్‌ జాయెద్‌ రోడ్డుపై కొత్త సాలిక్‌ గేట్‌

- July 17, 2018 , by Maagulf
షేక్‌ జాయెద్‌ రోడ్డుపై కొత్త సాలిక్‌ గేట్‌

దుబాయ్:షేక్‌ జాయెద్‌ రోడ్డుపై కొత్త సాలిక్‌ గేట్‌ ఏర్పాటు కానుంది. అబుదాబీ వైపుగా ఐబిఎన్‌ బత్తుతా మాల్‌ త్వాత ఈ సాలిక్‌ గేట్‌ని ఏర్పాటు చేస్తున్నారు. రానున్న కొద్ది వారాల్లో ఈ సాలిక్‌ గేట్‌ అందుబాటులోకి వస్తుంది. అల్‌ యలాయిస్‌ స్ట్రీట్‌పై షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్డు వైపు వెళ్ళే బ్రిడ్జి పనులు పూర్తయ్యాక సాలిక్‌ గేట్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ టోల్‌ గేట్‌ ద్వారా షేక్‌ జాయెద్‌ రోడ్డులో ట్రాఫిక్‌ తగ్గుతుంది. దుబాయ్‌లో ఇది ఎనిమిదవ టోల్‌ గేట్‌. 62 కిలోమీటర్ల షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ కోసం ఈ టోల్‌ గేట్‌ని ప్లాన్‌ చేశారు. 2.1 బిలియన్‌ దిర్హామ్‌ల ఖర్చుతో సెయిహ్‌ షుబైబ్‌ (అబుదాబీ - దుబాయ్‌ బోర్డర్‌) నుంచి స్వీహాన్‌ రోడ్‌ ఇంటర్‌ఛేంజ్‌ వరకు రూపొందించిన ఈ రోడ్డు 2016లో ట్రాఫిక్‌కి క్లియరెన్స్‌ పొందింది. చెరో వైపు నాలుగు లేన్లు ఈ రోడ్డు ప్రత్యేకత. గంటకు 8000 వాహనాల కెపాసిటీ ఈ రోడ్డుకి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com