ఇండియా:మైనర్లపై అత్యాచారానికి మరణ శిక్షే!
- July 18, 2018
న్యూఢిల్లీ: దేశంలో మహిళలు చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలను కట్టడిచేసేందుకు కేంద్ర కేబినెట్ కొత్త చట్టాలను అమలుకుతెస్తోంది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా క్రిమినల్ చట్టాలను సవరించే బిల్లును ఎన్డిఎప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది ఈమేరకు కేంద్ర కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. ఆరోపణలు రుజువైన పక్షంలో కనీసంగా ఏడేళ్లనుంచి పదేళ్లపాటు కఠిన కారాగారశిక్ష విధిస్తారు. నిందితులకు అవసరమైతే మరణశిక్షనుసైతం వఙదిస్తారు. ఇందుకు సంబంధించి రూపొందించినముసాయిదా బిల్లు కేంద్ర హోం శాఖ కేబినెట్‌కు అందచేసింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్ మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరించారు. క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్‌ను గత ఏప్రిల్ 21వ తేదీనుంచి అమలులోచేసారు. కతువాలో జరిగినచిన్నారిబాలికపై అత్యాచారం హత్యకు సంబంధించి భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తి అధికార ప్రభుత్వంపై విరుచుకుపడటంతో ప్రభుత్వం అప్పటికప్పుడు ఆర్డినెన్స్‌ను అమలుచేసింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో కూడా ఒక యువతిపై సాక్షాత్తూ బిజెపి ఎమ్మెల్యే అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనితో కొత్తగా క్రిమినల్ న్యాయచట్టాలను సవరించిన బిల్లును ప్రవేశపెడుతున్నారు. మహిళలపై అత్యాచారం జరిగితే ఏడునుంచి పదేళ్లపాటుశిక్ష ఉంటుంది. అవసరమైతే జీవితఖైదుకు పొడిగిస్తారు. 12 ఏళ్లలోపు బాలికపై అత్యాచారంచేసిన వారికి మరణశిక్షను విధిస్తారని అధికారులు వెల్లడించారు. 16 ఏళ్లలోపు బాలికఅయితే కనీసం పదినుంచి 20 ఏళ్లవరకూ శిక్ష ఉంటుంది.
అవసరమైతే జీవితాంతం ఖైదు విధిస్తారు. ఇక 16 ఏళ్లలోపు బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే జీవితం మొత్తం జైలులోనే గడిపేటట్లు శిక్ష ఉంటుంది. అలాగే 12 ఏళ్లలోపు బాలిక అయితే 20 ఏళ్లు కనిష్టంగాను జీవితం మొత్తం ఖైదు, లేదా మరణశిక్షను అమలుచేస్తారు. 12 ఏళ్లలోపు బాలికపై సామూహిక అత్యాచారం చేస్తే ఆతర్వాత ఆతని జీవితం మొత్తం ఖైదు లేదా మరణశిక్ష ఉంటుందని కొత్తచట్టం నిర్దేశిస్తోంది. అంతేకాకుండా కేసులను సత్వరమే విచారణ పూర్తిచేయాలి. అన్ని కేసుల్లోనూ రెండు నెలల్లోపే విచారణ పూర్తి కావాల్సి ఉంది. అన్ని అత్యాచారాల కేసుల్లో విచారణలు రెండునెలలు అప్పీళ్లు ఆరు నెలల్లోపు పూర్తిచేయాలని సూచించింది. ఈ కేసుల్లో నిందితులకు ఎలాంటి ముందస్తు బెయిల్ సౌకర్యం లేదు. 16 ఏళ్లలోపు వారికి ముందస్తు బెయిల్ ఇవ్వరు. బాధితుల కుటుంబీకులకు, పబ్లిక్ప్రాసిక్యూటర్లకు 15 రోజుల వ్యవధితో నోటీస్ ఇస్తారు. బెయిల్‌పై నిర్ణయం తీసుకునే ముందు పిపి, బాధిత కుటుంబ ప్రతినిధి అభిప్రాయం తీసుకుంటారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్