రోడ్డు ప్రమాదంలో బహ్రెయినీ డ్రైవర్ మృతి
- July 19, 2018
మనామా: షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై బురి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బహ్రెయినీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. వాహనంపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైవేపై వున్న స్టీల్ ఫెన్స్పైకి వాహనం దూసుకుపోయింది. ప్రమాద సమయంలో కారు జిసిసి లైసెన్స్ ప్లేట్స్ కలిగి వుందనీ, ఈ ఘటనలో వేరే వాహనాల ప్రమేయం లేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పోలీస్ సకాలంలో అక్కడికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. సుమారు గంట వరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రమాదానికి గురైన కారుని అక్కడినుంచి తొలగించడంతో ట్రాఫిక్ అవాంతరాలు తగ్గాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్