నేనేం తప్పు చేయలేదు:యాంకర్ అనసూయ
- July 19, 2018యాంకర్ కం.. నటి అనసూయపై మరోసారి నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఇందులో ఆమె తప్పు ఏమి లేకపోయినా.. దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్ల నుంచి అనసూయ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.అసలు వివరాల్లోకి వెళితే యాంకర్ అనసూయ నిన్న(బుధవారం) హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 గుండా వెళుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ అనసూయ కారును దాటాడు. అయితే అతను డ్రైవింగ్ సమయంలో మొబైల్ లో వీడియోలు చూస్తున్నాడు. దీంతో అనసూయ ఈ తతంగాన్ని వీడియో తీసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ లో ట్యాగ్ చేసింది.
'డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. ఇలాంటి సంఘటనలు నన్ను భయపెట్టిస్తున్నాయి. ఇంతకు ముందు వేరే వారి తప్పిదం వలన నేను ప్రమాదానికి గురయ్యాను. దయ చేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్స్‌ని వదలొద్దు.రోడ్లపైకొచ్చి తమకిష్ట మొచ్చినట్టు డ్రైవ్ చేసే వారికి.. ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా? అని అనసూయ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఆ వీడియో సందేశంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. చీప్ పబ్లిసిటీ స్టంట్ కోసమే ఆమె ఇలా చేస్తోందని పలువురు ట్రోల్ చేస్తూ.. రీట్వీట్లు చేశారు. అయితే వీటిని తాను పట్టించుకోనని.. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది సరైన పనే అని వారికీ రీట్వీట్ చేశారు అనసూయ.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ