10 దిర్హామ్‌లకే టిక్కెట్: దుబాయ్ ఎయిర్‌లైన్
- July 19, 2018
దుబాయ్‌కి చెందిన ఎయిర్ లైన్ ఫ్లై దుబాయ్, సమ్మర్ నేపథ్యంలో స్పెషల్ ఫేర్స్‌ని అనౌన్స్ చేసింది. దుబాయ్ నుంచి వెళ్ళేందుకుగాను కనిష్టంగా 10 దిర్హామ్‌ల ఖర్చుతో టిక్కెట్లను ప్రకటించింది. అయితే ఈ అతి తక్కువ ధర పిల్లలకు మాత్రమే. జులై 19 నుంచి జులై 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఈ సమయంలో టిక్కెట్ కొనుగోలు చేసినవారికి ఆగస్ట్ 15 వరకు ప్రయాణించే వీలుంటుంది. జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ ఇటలీ తదిత డెస్టినేషన్స్ ఇందులో వున్నాయి. జోర్డాన్, ఇరాక్, జాంజిబార్ కూడా ఈ లిస్ట్‌లో వున్నాయి. ఈ ఆఫర్ పొందాలంటే అడల్ట్ రిటర్న్ టిక్కెట్‌ని ఎకానమీలో కొనుగోలు చేయాల్సి వుంటుంది. అడల్ట్ ఫుల్ ఫేర్ చెల్లించాక, చిన్నారులకు 10 దిర్హామ్‌లకే టిక్కెట్‌ని పొందవచ్చు. పన్నులు, సర్‌ఛార్జిలు దీనికి అదనం. పిల్లలు 3 నుంచి 12 ఏళ్ళ వయసువారైతేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దుబాయ్ నుంచి ఎకానమీ క్లాస్ ఫేర్స్కి మాత్రమే ఈ ఆఫర్ పరిమితం.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!