ఇరు దేశాల సంబంధాలు బలోపేతం
- July 21, 2018
అబుధాబి : ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్ళాలని, అందుకోసం కృషి చేయాలని చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యుఇఎ) నిర్ణయించాయి. ప్రస్తుతం అబూదాబిలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, యువ రాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌లతో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. విస్తృతమైన రంగాల్లో, ఉన్నత స్థాయిలో సంబంధాల అభివృద్ధికి కృషిని కొనసాగించాలని ఇరుపక్షాల నేతలు భావించారు.
గత 29ఏళ్ళలో చైనా అధ్యక్షుడు యూఏఈలో పర్యటించడం ఇదే మొదటిసారి. అధికార పర్యటనలో భాగంగా అబూదాబి చేరుకున్న జిన్‌పింగ్‌కు ఘనస్వాగతం లభించింది. 2015లో బీజింగ్‌లో యువరాజుతో జరిగిన సమావేశం గురించి జిన్‌పింగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక స్నేహ సహకారాన్ని పెంపొందించడానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ఆనాడు ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సమగ్రమైన, నూతన అభివృద్ధి దశలోకి ప్రవేశించాయని అన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







