170 మందిని హడలెత్తిస్తున్న భారీ మంచు కొండ

- July 24, 2018 , by Maagulf
170 మందిని హడలెత్తిస్తున్న భారీ మంచు కొండ

గ్రీన్‌లాండ్‌లోని ఇనార్‌సూట్ అనే గ్రామం పెను ప్రమాదంలో అంచున చిక్కుకుంది. కోటి 10 లక్షల టన్నుల బరువున్న భారీ మంచుకొండ నీటిలో తేలుతూ ఈ ఊరికి దగ్గరగా చేరింది. దీనితో అది ఎప్పుడు విరిగిపోతుందోనని అక్కడి ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నీటిపై వంద మీటర్ల ఎత్తు వరకు ఉన్న భారీ మంచుకొండపై అక్కడక్కడా భారీ పగుళ్ళు రావటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో అక్కడి అధికారులు ముందు జాగ్రత్తగా హార్బర్‌లోని ఫిషింగ్ బోట్లను వేరే చోటికి తరలిస్తున్నారు. ఆ ఊరిలో మొత్తం జనాభా 170 మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com